ISS: నాసా మిషన్‌లోకి భారతీయ వ్యోమగామి.. ప్రకటించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Jul 28 , 2024 | 09:51 AM
భారత గగన్‌యాన్ మిషన్‌లో(Gaganyaan Astronaut) శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు నాసాతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలిపారు.
ఢిల్లీ: భారత గగన్‌యాన్ మిషన్‌లో(Gaganyaan Astronaut) శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు నాసాతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలిపారు. నాసా ఈ మిషన్ కోసం ‘యాక్సియమ్ స్పేస్’ అనే ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటుంది.
వ్యోమగామి శిక్షణ, ఎంపిక
గగన్‌యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం టెస్ట్ పైలట్ల నుంచి నలుగురు వ్యోమగాములను భారత వ్యోమగామి బోర్డు ఎంపిక చేసింది. ఈ మిషన్ వచ్చే ఏడాది తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ వ్యోమగాములు రష్యాలో ప్రాథమిక అంతరిక్ష ప్రయాణ శిక్షణను పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నారు. గగనయాత్ర శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మూడు సెమిస్టర్లలో రెండు పూర్తయ్యాయి.
పురోగతి..
సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇంజిన్‌లతో సహా ప్రొపల్షన్ సిస్టమ్‌ల కోసం గ్రౌండ్ టెస్టింగ్ పూర్తయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర వివరించారు. ఈ మోటార్‌ల స్టాటిక్ టెస్టింగ్‌తో పాటు క్రూ ఎస్కేప్ సిస్టమ్ సాలిడ్ మోటార్‌ల రూపకల్పన, రియలైజేషన్ పూర్తయింది. మొదటి టెస్ట్ వెహికల్ మిషన్ (TV-D1) క్రూ ఎస్కేప్ సిస్టమ్, పారాచూట్ విస్తరణ విజయవంతం అయింది.
క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ అభివృద్ధి
క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ నిర్మాణాల డిజైన్‌లు పూర్తయ్యాయి. వివిధ పారాచూట్ సిస్టమ్‌లు పరీక్షించారు. క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ కోసం గ్రౌండ్ టెస్ట్ ప్రోగ్రామ్ పూర్తయింది. అయితే సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ టెస్ట్ ప్రోగ్రామ్ ముగింపు దశకు చేరుకుంది. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ క్యారెక్టరైజేషన్ కూడా ఖరారైంది. ఆర్బిటల్ మాడ్యూల్ ప్రిపరేషన్ ఫెసిలిటీ, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ, ఆక్సిజన్ టెస్టింగ్ ఫెసిలిటీతో సహా కీలకమైన గ్రౌండ్ సౌకర్యాలు అమలులోకి వచ్చాయి. మిషన్ కంట్రోల్ సెంటర్, గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి.