Home » National News
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.
ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, మహారాష్ట్ర ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని అజిత్ పవార్ చెప్పారు. 1985 నుంచి మహారాష్ట్రలో ఓ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని అన్నారు.
నక్సల్స్కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నేటితో పూర్తి కానున్న 22వ హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రధాన నేతలు వస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, ఆరోగ్యం, సైన్స్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
హర్యానాకు చెందిన ఏనిమిదేళ్ల గేదె.. అన్మోల్ ప్రత్యేకతను సంతరించుకుంది. జస్ట్ 15 వందల కేజీలున్న.. ఈ గేదె మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. దీని ఖరీదు రూ. 23 కోట్లు ఉంది. అన్మోల్ను ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. ఇక రోజు వారి మెనూని చూస్తే..
కార్తీక పౌర్ణిమి సందర్భంగా లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాదు ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మీకు షార్ట్ వీడియోలను తీసే టాలెంట్ ఉందా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వినూత్నంగా ఓ వీడియో తీస్తే మీరు రూ.1.5 లక్షలు గెల్చుకునే అవకాశం ఉంది. అయితే దీనికోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మేఘాలయలోని ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజధాని షిల్లాంగ్లోని ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.