Rahul Gandhi: రాహుల్ గాంధీ బ్యాగులను తనిఖీ చేసిన ఈసీ
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:05 PM
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల బ్యాగులు, హెలికాప్టర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్యాగులను ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఈసీ అధికారులు శనివారంనాడు తనిఖీలు చేశారు. వారు బ్యాగులు తనిఖీ చేస్తుండగా రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రయాణిస్తు్న్న హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాల పాటు శుక్రవారం ఆలస్యం జరగడం, దానిపై రగడ చోటుచేసుకున్న క్రమంలో తాజా ఘటన చోటుచేసుకుంది.
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్ 45 నిమిషాలు ఆలస్యం
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు. అయితే ఈసీ చర్యను బీజేపీ నేతలు సమర్ధించారు. ఇది స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు జరిగే రొటీన్ పక్రియేనని పేర్కొన్నారు.
కాగా, కొందరు ఎంపిక చేసిన నేతలనే తనిఖీలు చేస్తు్న్నారంటూ విపక్షాల ఆరోపణల క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సహా పలువురు ఎన్డీయే నేతల బ్యాగేజీలను కూడా ఈసీ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. 288 అసెంబ్లీ నియోజవవర్గాలున్న మహారాష్ట్రంలో ఒకే విడతలో ఈనెల 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి:
TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు
Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..
Read More National News and Latest Telugu News