Share News

Sukhbir Singh Badal: 'సాద్' అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:40 PM

శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.

Sukhbir Singh Badal: 'సాద్' అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా

చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ (SAD) పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbhir Singh Badal) శనివారంనాడు రాజీనామా చేశారు. సిక్కు మత సూత్రాలు ఉల్లంఘించిన వ్యక్తిగా (Tankhaiya) ఆయనను అకల్ తఖ్త్ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో శిరోమణి అకాలీ దళ్ పార్టీకి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేసి, ఆ లేఖను పార్టీ వర్కింగ్ కమిటీకి పంపారు. ఈ విషయాన్ని 'సాద్' సీనియర్ నేత దల్జిత్ సింగ్ చీమా ధ్రువీకరించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ బ్యాగులను తనిఖీ చేసిన ఈసీ

ABN ఛానల్ ఫాలో అవ్వండి

''పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్‌బీర్ సింగ్ రాజీనామా సమర్పించారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగగమైంది. తన నాయకత్వంపై నమ్మకం ఉంచి తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సుఖ్‌బీర్ కృతజ్ఞతలు తెలియజేశారు'' అని దల్జీత్ తెలిపారు.


శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలోనే అధ్యక్షుడు రాజీనామా చేశారని, నవంబర్ 18న వర్కింగ్ కమిటీ సమావేశమై, రాజీనామాపై పరిశీలన చేసి ఎన్నికలపై సమగ్ర ప్రకటన చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, సభ తుది నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి మెజారిటీ ఉంటే వారు అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారని చెప్పారు. కాగా, పంజాబ్‌లో కీలక అంశాలను పరిష్కరించడంలోనూ, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ శిరోమణి అకాలీ దళ్ చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ఈ క్రమంలో బాదల్ రాజీనామా కీలక పరిణామంగా చెబుతున్నారు. పార్టీ పునరుజ్జీవనానికి, ప్రాధాన్యతా క్రమాలను మరోసారి హైలైట్ చేస్తూ పటిష్టం కావడానికి ఇదొక అవకాశమని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు

Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 04:40 PM