Home » Naveen Patnaik
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బీజేడీ నేత వీకే పాండియన్ 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆపని చేసినట్టు చెప్పారు.
భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోదీ చేసిన సవాల్‌పై బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కాంధమాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ కు సవాల్ విసిరారు. ఒడిశాను సుదీర్ఘ కాలంగా పాలించిన పట్నాయక్ పేపరు చూడకుండా అన్ని జిల్లాల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు.
ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.