Share News

Lok Sabha Elections: ఒడిశాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో పేపర్ చూడకుండా చెప్పండి?.. సీఎంకు మోదీ సవాల్

ABN , Publish Date - May 11 , 2024 | 05:07 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కాంధమాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్‌ కు సవాల్ విసిరారు. ఒడిశాను సుదీర్ఘ కాలంగా పాలించిన పట్నాయక్ పేపరు చూడకుండా అన్ని జిల్లాల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

Lok Sabha Elections: ఒడిశాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో పేపర్ చూడకుండా చెప్పండి?.. సీఎంకు మోదీ సవాల్

భువనేశ్వర్: ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు విమర్శలు గుప్పించుకోవడం పరిపాటి. ఒడిశా (Odisha)లో మాత్రం అధికార బీజేడీ, విపక్ష బీజేపీ మధ్య మాత్రం పెద్దగా విమర్శలు చోటుచేసుకోవు. ఆసక్తికరంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు కాంధమాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్‌ (Naveen Patnaik)కు సవాల్ విసిరారు. ఒడిశాను సుదీర్ఘ కాలంగా పాలించిన పట్నాయక్ పేపరు చూడకుండా అన్ని జిల్లాల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు.


''నవీన్ బాబుకు ఒక సవాలు విసురుతున్నాను. సుదీర్ఘ కాలంగా పాలన సాగిస్తున్న ఆయన రాష్ట్రంలోని జిల్లాల పేర్లు, వాటి రాజధానుల పేర్లు పేపరు చూడకుండా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాను. జిల్లాల పేర్లే ఆయన చెప్పలేకపోతే మీ (ప్రజల) బాధ ఆయనకు ఎలా తెలుస్తుంది?'' అని ప్రధాని నిలదీశారు. రాష్ట్ర ప్రజల సామర్థ్యంపై ప్రభుత్వానికి నమ్మిక లేదని తాను అనుకుంటున్నానని, ఒడిశా గణనీయంగా అభివృద్ధి చెందడానికి అపనమ్మకమే అవరోధంగా నిలుస్తోందని అన్నారు. పర్యాటకరంగానికి విస్తృతమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. పోఖ్రాన్ అణుపరీక్ష ఇక్కడే జరిగింది గుర్తుచేసారు. వికసతి ఒడిశా సాధనకు రాబోయే ఎన్నికలు కీలకమని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగపరిచేందుకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఒడిశా ప్రజలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలు మరువలేనని, ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశానికి నిస్వార్థ సేవలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే 13న ప్రారంభమై జూన్ 1 వరకూ జరుగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కదు.. మోదీ జోస్యం


గత ఎన్నికల ఫలితాలివే..

ఒడిశాలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ) 146 స్థానాలకు గాను 112 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 23 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో నెగ్గింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీజేడీ గెలుచుకుంది. బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఒక సీటుకే పరిమితమైంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 11 , 2024 | 05:07 PM