Home » NDA Alliance
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.
ఎన్డీయే కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి ప్రజలు తనపట్ల చూపించిన ప్రేమాభిమానాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 4వ వార్డు శాంతినగర్‌లో ఉన్న పోలింగ్ కేంద్రం 164, 169, 170, 171 బూత్‌ల వద్ద రిగ్గింగులకు వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న వేళ.. వైసీపీ (YSRCP) తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తోంది. అధికార మదం, ఓటమి భయంతో.. పోలింగ్ కేంద్రాల (Polling Booths) వద్ద నానా రాద్ధాంతం చేస్తోంది. ఓటింగ్ సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చాలా పోలింగ్ బూతుల్లో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తోంది. ఓటర్లను వైసీపీ మూకలు భయ భ్రాంతులకు గురి చేసి దాడులకు తెగబడ్డారు.