AP Elections2024 :వైసీపీకి ఓటమి తప్పదు... అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు: నాగబాబు
ABN , Publish Date - May 15 , 2024 | 05:41 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు.
Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
పోలింగ్ అనంతరం ఏపీలో నెలకొన్న హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలని కోరారు. జూన్ 4న ఎన్నికల్లో వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నాగబాబు పేర్కొన్నారు.
AP Elections: అంతలోనే మాట మారింది..?
కాగా.. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం సీఈఓ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లర్లకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించారు. నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టాం...అదనపు బలగాలు పంపించామని తెలిపారు.
అభ్యర్థులు అందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఏపీ డీజీపీకు అదేశాలిచ్చారు. పలు జిల్లాల్లో జరిగిన ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
AP Politics: టియర్ గ్యాస్ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత
AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ
Read Latest AP News And Telugu News