Home » NEET Paper Leak 2024
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పి.చిదంబరం కీలక సూచనలు చేశారు. ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం వదులుకోవాలని, వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల నిర్వహణ హక్కును తిరిగి రాష్ట్రాలకు అప్పగించాలని 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్‌లో(NEET Paper Leak) ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. అయితే తనను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన గంగాధర్.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.
NEET UG కేసులో సుప్రీంకోర్టులో ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న నీట్ పరీక్షలో అవకతవకలు కేవలం పాట్నా, గోద్రాలోని కొన్ని కేంద్రాలకే పరిమితమయ్యాయని అఫిడవిట్‌లో పేర్కొంది.
నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే.. ఏ స్థాయిలో జరిగిందో, ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో గుర్తించాల్సిన అవసరం ఉన్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఆ అంశాలను బట్టే పరీక్షను మళ్లీ నిర్వహించాలా? వద్దా?
నీట్ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపరు లీకైన విషయం నిజమని, దీనిపై ప్యానల్ తప్పనిసరిగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం అయినందున 'నీట్ రీటెస్ట్'ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని తెలిపింది.
వివాదాస్పద అండర్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) నేడు (జులై 8న) విచారించనుంది. ఈ క్రమంలో 20 లక్షల మందికిపైగా రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్‌పై గందరగోళం నెలకొంది. నీట్ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.
నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.