NEET UG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. పరీక్షలో అవకతవకలు సహా 38 పిటిషన్లు
ABN , Publish Date - Jul 08 , 2024 | 07:03 AM
వివాదాస్పద అండర్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) నేడు (జులై 8న) విచారించనుంది. ఈ క్రమంలో 20 లక్షల మందికిపైగా రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వివాదాస్పద అండర్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) నేడు (జులై 8న) విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుండగా..విచారణలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను కూడా చేర్చనున్నారు. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని, మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు వీటిలో ఉన్నాయి. ఇప్పటికే నీట్ యూజీ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్‌లు ధాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు విచారించనున్నారు.
అవకతవకలు జరిగాయని
మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్ సహా పలు రకాల అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలువురు విద్యార్థులు, విద్యా సంస్థలు పిటిషన్లను దాఖలు చేశాయి. వాటిలో వంశిక యాదవ్, హితేన్ కశ్యప్‌ల తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన న్యాయవాది సన్నీ కడియన్ కూడా ఉన్నారు. అయితే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం మొదట బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. పాట్నాలోని శాస్త్రి నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు.
పూర్తి నివేదిక
ఈ వ్యవహారం క్రమంగా పెరగడంతో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కేసును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కేసు దర్యాప్తును ముమ్మరం చేసి దర్యాప్తు చేశారు. విచారణలో పేపర్ లీకేజీకి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించకముందే, బీహార్ పోలీసుల దర్యాప్తు సంస్థ పేపర్ లీక్ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో బీహార్ పోలీసుల నుంచి దర్యాప్తు, చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఇది కూడా EOU తరపున సుప్రీంకోర్టులో అఫిడవిట్‌తో పాటు సమర్పించబడింది.
రద్దు చేయకూడదని
మరోవైపు ఈ పరీక్ష రద్దు చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టును కోరారు. తమకు మంచి మార్కులు వచ్చాయని, ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయోద్దని కోరారు. ఈ నేపథ్యంలో 20 లక్షల మందికిపైగా రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి:
చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
Read Latest National News and Telugu News