Home » NEET PG Exam
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి.
నీట్ ప్రశ్నపత్రంలో ‘ఆటమ్స్ (అణువుల) లక్షణాల’పై ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడానికి ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్‌పై గందరగోళం నెలకొంది. నీట్ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.
నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.