Share News

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:59 PM

నీట్.. మరొకరిని బలిగొన్నది. డాక్టర్‌ కావాలన్న తన కోరిక నెరవేరదనే భయంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Chennai: మరొకరిని బలిగొన్న నీట్..

- నీట్‌కు భయపడి విద్యార్థిని ఆత్మహత్య

చెన్నై: నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేనని, ఎన్నోయేళ్లుగా డాక్టర్‌ కావాలన్న తన కోరిక నెరవేరదనే భయంతో ఓ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిం ది. సేలం జిల్లా ఎడప్పాడి సమీపం పుదుపాళయం పెరియముత్తయంపట్టి ప్రాంతానికి చెందిన సెల్వరాజ్‌, చంద్ర దంపతుల కుమార్తె సంధ్య గత యేడాది ప్లస్‌-2లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్‌ కావాలన్న తపనతో జలకంఠాపురంలో ఉన్న ప్రైవేటు శిక్షణా కేంద్రంలో చేరి గత 10 నెలలుగా శిక్షణ పొందుతోంది. అయినా నీట్‌లో ఉత్తీర్ణత సాధించడం సులభం కాదనే భయం పట్టుకుంది.

ఈ వార్తను కూడా చదవండి: Darshan: కారు పార్కింగ్‌ తెచ్చిన తంటా.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌ అరెస్టు


city8.2.jpg

ఈ విషయాన్ని సంధ్య తన స్నేహితురాళ్లతో చెబుతూ బాధపడుతుండేది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చుట్టుపక్కల వారు ఏదో పనిమీద ఆ ఇంటికి వచ్చినప్పుడు నోటిలో నురగలు కక్కుకుని సంధ్య నేలపై పడి ఉండటం చూసి వెంటనే సేలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సంథ్య శుక్రవారం వేకుజాము మృతి చెందింది. కొంగణాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 01:59 PM