నీట్‌కు భయపడి ప్లస్-2 విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:19 PM
నీట్ పరీక్ష మరొకరిని బలిగొంది. నీట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో దేవదర్శిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పరీక్ష పుణ్యమాని చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ ప్రాణాలు తీసుకున్నారు.

చెన్నై: ఓ ప్రైవేటు సంస్థలో నీట్‌కు శిక్షణ పొందుతూ వచ్చిన బాలిక ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ఉరివేసుకుంది. చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా ఊరపాక్కం శాస్త్రిభవన్ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సెల్వరాజ్ అయనచేరిలో బేకరీ నడుపుతున్నాడు. ఈ దంపతుల పెద్దకుమార్తె దేవదర్శిని ముగప్పేర్‌లోని ప్రైవేటు పాఠశాలలో 2021లో ప్లస్-2 ఉత్తీర్ణురాలైంది. 20 21 నుంచి రెండుసార్లు నీట్ రాసినా తగినన్ని కట్‌ఆఫ్ మార్కులు రాలేదు.
ఈ వార్తను కూడా చదవండి: Chhattisgarh Maoist Clash: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
ఈ పరిస్థితుల్లో అన్నానగర్‌లోని ప్రైవేటు అకాడమీలో మూడోసారి నీట్‌కు శిక్షణ పొందింది. మూడోసారి కూడా నీట్‌లో మంచి మార్కులు సంపాదించలేననే భయంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న కిలాంబాక్కం పోలీసులు(Kilambakkam Police) సంఘటనా స్థలానికి చేరుకున దేవదర్శిని మృతదేహాన్ని స్వాధీనం పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News