VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:18 AM
ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు

పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే.. కోర్టులు కాదు
పార్లమెంటుకు, ప్రజలకు అదే జవాబుదారీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని.. న్యాయస్థానాలు కాదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. పార్లమెంటుకు, ప్రజలకు కార్యనిర్వాహక వ్యవస్థే జవాబుదారీగా పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్)ను వికేంద్రీకరించాలంటూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ఎన్‌వీఎన్ సోము చేసిన డిమాండ్‌పై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇది డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమని.. నీట్‌ను కేంద్రీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ జోక్యం చేసుకున్నారు. ‘ప్రభుత్వమే ఫైనల్. ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాన్ని కోర్టుతో కలిసి పంచుకోగలదా? ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే పాలన చేయాలి. ఎందుకంటే అదే పార్లమెంటుకు, ప్రజలకు జవాబుదారీ. దేశాన్ని పాలించేందుకు ప్రజలు దానిని ఎన్నుకుంటారు. అందుచేత ఈ అంశంపై దృష్టి సారించండి’ అని సూచించారు.
ఇవి కూడా చదవండి:
AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..