Home » New Parliament Building
కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్‌ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలాఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారన్నవార్తలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించాయి.
పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత రెండు ఎన్నికల నుంచి జరగలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మరోసారి ఇవ్వడం స్పష్టమని అనిపిస్తోందన్నారు.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారపార్టీ ప్రకటించింది. ఢిల్లీలో అత్యాధునిక వసతులు, భద్రత నడుమ
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈనెల 28న(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి మోదీ, లోక్‌సభ స్పీకర్ఓం ప్రకాశ్ బిర్లాతో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నట్లు హోమంత్రి అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్అనే చారిత్రక రాజదండం ఉంచనున్నట్లు అమిత్‌షా తెలిపారు.
ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తాజాగా, దీనికి ముహూర్త దోషం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొందరు దీనితో ఏకీభవిస్తుంటే, మరికొందరు అలాంటిదేమీ లేదంటూ భిన్నాభిప్రాయులు వ్యక్తం చేస్తున్నారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ చర్యలు రాజ్యాంగ అధిపతిని అవమానించడమేనని దుయ్యబడుతున్నాయి. మే 28న జరిగే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్రకటనను జారీ చేశాయి.
భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అభివర్ణించారు.
దేశ రాజధానిలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు 19 పార్టీలు ప్రకటించాయి.