Home » Nitish Kumar
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై డాటాను బీహార్ ప్రభుత్వం మంగళవారంనాడు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్ల లో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది.
ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు.
బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.
మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.
సీఎం నితీశ్ కుమార్ అఖిల పక్ష భేటికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 9 ప్రధాన పార్టీలు భేటీకి హాజరుకావాలని ఆయన కోరారు. ఈ మీటింగ్ లో కుల గణన(Caste Census) నివేదికపై చర్చించనున్నారు. ప్రజల ఆర్థిక స్థితి గతులు, కులాల వారిగా సంక్షేమం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సందర్భంగా నితీశ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
లోక్సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సెక్రటేరియట్ కు వెళ్లి తన మంత్రులు విధుల్లో ఉన్నారో లేరో స్వయంగా పరిశీలించారు. ఎక్కువ మంది మంత్రులు తమ కార్యాలయాల్లో లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) ఎన్డీఏ(NDA)లో చేరాలని భావిస్తున్నారనే వార్తలను ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో నితీశ్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.