Nitish Kumar:లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో కాంగ్రెస్ వెనకబడింది.. నితీష్ కుమార్ చురకలు
ABN , First Publish Date - 2023-11-02T15:18:22+05:30 IST
కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు.
పట్నా: కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వ్యవహారంతో ఇండియా కూటమి(INDIA Alliance) పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలలో జరగనున్న శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన నేపథ్యంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎన్డీఏ(NDA) కూటమి నుంచి బయటకి వచ్చాక ఇండియా కూటమితో నితీష్ జత కట్టారు. పట్నాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI) ర్యాలీని ఉద్దేశించి నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం.
ఇండియా కూటమిలో వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ వారితో చర్చలు ఫలప్రదంగా లేవు. కాంగ్రెస్ మాత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కూటమిలో కాంగ్రెస్ ది ప్రధాన పాత్ర. పార్టీల మధ్య మనస్పర్థలు వస్తే పరిష్కరించాల్సిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది" అని అన్నారు. ఇండియా కూటమి నేతల చివరి సమావేశం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 మధ్య కాలంలో ముంబయిలో జరిగింది. తరువాతి మీటింగ్లు జరగాల్సి ఉన్నా కాంగ్రెస్ ఇప్పటికీ ఆ వివరాలు వెల్లడించలేదు. మధ్యప్రదేశ్ లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పినా ఇప్పటికీ స్పందన లేదు. ఇండియా కూటమి బలోపేతం కోసం నితీష్ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితర నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఇవి జరిగాయి. ఇండియా కూటమి తొలి సమావేశం జూన్ లో పట్నాలో జరిగింది. ఢిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ని కాంగ్రెస్ వ్యతిరేకించకపోవడంతో ఆప్ సమావేశానికి దూరంగా ఉంది. అప్పడు నితీష్ రెండు పార్టీల మధ్య సమస్యను పరిష్కరించారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్ల పంపకంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు మధ్య ఏర్పడిన వివాదం ఇండియా కూటమిలో మరో సారి లుకలుకలు బయటపెట్టింది. ఈ టైంలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారిస్తే మంచిదని నితీష్ వాదన. ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.