Share News

Maharashtra Cabinet Expansion: 'మహా' మంత్రులు వీరే.. ఏ పార్టీకి ఎన్నంటే

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:04 PM

బీజేపీ నుంచి 19 మంది, షిండే శివసేన నుంచి 11 మంది, అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి 9 మంది మంత్రివర్గంలో చేరారు. దీంతో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 42కు చేరింది.

Maharashtra Cabinet Expansion: 'మహా' మంత్రులు వీరే.. ఏ పార్టీకి ఎన్నంటే

ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అట్టహాసంగా జరిగింది. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని 'మహాయుతి' ప్రభుత్వంలో కొత్తగా 39 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి 19 మంది, షిండే శివసేన నుంచి 11 మంది, అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి 9 మంది మంత్రివర్గంలో చేరారు. దీంతో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 42కు చేరింది. మంత్రివర్గంలో గరిష్టంగా 43 మందిని తీసుకునే అవకాశం ఉంది.

Mani Shankar Aiyar: నా ఎదుగుదల, పతనానికి గాంధీ ఫ్యామిలీనే కారణం: మణిశంకర్ అయ్యర్


కాగా, కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన వారిలో 33 మంది క్యాబినెట్ మంత్రులు‌గా, ఆరుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 1991 తర్వాత నాగపూర్‌లో మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగడం ఇది రెండోసారి.


కొత్త మంత్రులు వీరే

బీజేపీ: చంద్రశేఖర్ బవాంకులే, రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, గణేష్ నాయక్, మంగల్ ప్రభాత్ లోథా, జయకుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావె, అశోక్ ఉయికె, ఆశిష్ షెలార్, శివేంద్ర రాజే భోసలే, జయకుమార్ గోరె, సంజయ్ సవ్‌కరె, నితీష్ రాణె, ఆకాష్ ఫుండ్‌కర్, మాధురి మిసాల్ (సహాయమంత్రి), పంకజ్ భోయర్ (సహాయ మంత్రి), మేఘనా బోర్డికర్ (సహాయమంత్రి).

శివసేన: గులాబ్‌రావు పాటిల్, దాదా భుసె, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామత్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ షిర్సత్, ప్రతాప్ సర్నాయక్, పత్ గోగవాలె, ప్రకాష్ అబిట్‌కర్, ఆశిష్ జైశ్వాల్ (సహాయమంత్రి), యోగేష్ కదమ్ (సహాయమంత్రి).

ఎన్‌సీపీ: హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దత్తాత్రేయ్ భర్నె, అదితి టట్కరె, మాణిక్‌రావు కోకటె, నర్హరి జీర్వాల్, మకరంద్ జాదవ్ పాటిల్, బాబాసాహెబ్ పాటిల్, ఇంద్రాణి నాయక్ (సహాయమంత్రి).


ఇవి కూడా చదవండి..

PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

For National News And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 08:04 PM