Share News

AP Assembly: అసెంబ్లీలో ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు!

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:55 PM

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండ్రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో తొలిరోజు శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు..

AP Assembly: అసెంబ్లీలో ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండ్రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో తొలిరోజు శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు .... అనే నేను అంటూ ప్రమాణం చేయడం జరిగింది. ఇవాళ మొత్తం 172 మంది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేయగా.. మరో ముగ్గురు అసెంబ్లీకి రాలేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి చెందినవారే.


TDP-Flag.jpg

అసెంబ్లీకి ఎందుకు రాలేదు..!

టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు ఇవాళ ప్రమాణం చేయలేకపోయారు. శాసన సభకు అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ముగ్గురు ప్రమాణం చేయలేకపోయారు. ఈ ముగ్గురు శనివారం నాడు ప్రమాణం చేస్తారని టీడీపీ హైకమాండ్ తెలిపింది. కాగా.. ఇవాళ ప్రొటెం స్పీకర్, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతోనే శాసన మొత్తం నడిచింది. శాసన సభ్యుల ప్రమాణం అనంతరం సభ వాయిదా పడింది. శనివారం ఉదయం 10:30 గంటలకు తిరిగి శాసనసభ ప్రారంభం కానున్నది. రేపు ఉదయాన్నే ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.

Updated Date - Jun 21 , 2024 | 03:55 PM