Home » ODI World Cup
ODI World Cup: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత్‌లో భారత్‌ను ఓడించడం సామాన్య విషయం కాదని.. ఆస్ట్రేలియాకు ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.
ODI World Cup: అయితే ప్రపంచకప్‌లో సూర్యకుమార్ చెత్తగా ఆడాడంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ విమర్శలు చేశాడు. అసలు ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచిందని.. అతడు ఎలా ఆడాలని భావించాడో తెలియలేదని పేర్కొన్నాడు.
ODI World Cup: ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చరిత్ర సృష్టించింది. 2023 ప్రపంచకప్‌ను చరిత్రలో తొలిసారిగా 12,50,307 మంది స్టేడియాల్లో వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు.
Rahul Gandhi: వన్డే ప్రపంచకప్ ముగిసినా టీమిండియా ఓటమి ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు టీమిండియా ఓటమికి కారణాలు విశ్లేషిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమిండియా ఓటమికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశించిన టీమిండియా ఫైనల్‌లో ఓడిపోవడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓడిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆదివారం జట్టు ఓడిన అనంతరం స్వయంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ఆయన ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. వారితో ప్రేమగా మాట్లాడిన మోదీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు.
ODI World Cup: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. టీమిండియా ఓటమికి ఒక రకంగా చెప్పుకోవాలంటే పిచ్ కారణమని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్న భారత్ అహ్మదాబాద్‌లో మెరుగైన పిచ్ రెడీ చేసుకోవాల్సిందని అక్తర్ అన్నాడు.
Team India Lost in World Cup Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ మార్కెటింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకుని తమ ఉద్యోగులు ఈ షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. ఈ మేరకు సోమవారం కంపెనీకి సెలవు ప్రకటిస్తున్నట్లు తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది.
ICC Best Team: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఐసీసీ అన్ని జట్ల నుంచి బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఫైనల్లో విఫలమైనా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది.