Share News

World Cup: ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందని ఆ ఇద్దరు అభిమానులు..

ABN , First Publish Date - 2023-11-21T09:10:26+05:30 IST

కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశించిన టీమిండియా ఫైనల్‌లో ఓడిపోవడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

World Cup: ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందని ఆ ఇద్దరు అభిమానులు..

కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశించిన టీమిండియా ఫైనల్‌లో ఓడిపోవడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో తీవ్ర దు:ఖంలో ఉన్న ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమబెంగాల్‌లోని బంకురా, ఒడిషాలోని జాజ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో 23 ఏళ్ల రాహుల్ లోహర్ అనే యువకుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని బావమరిది ఉత్తమ్ సూర్ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో బంకురాలో గల బెలిటోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితత్తం సోమవారం ఉదయం బంకురా సమ్మిలాని మెడికల్ ఆసుపత్రికి పంపించామని పోలీస్ అధికారులు తెలిపారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్టు వారు చెప్పారు.


మరో ఘటనలో ఒడిషాలోని జాజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే మరో 23 ఏళ్ల యువకుడు తమ ఇంటి టెర్రస్ మీద ఉరి వేసుకున్నాడు. ఇతరులు చూసే లోపే అతను చనిపోయి శవమై వేలాడుతూ కనిపించాడు. మృతుడు దేవ్‌రంజన్ దాస్‌గా గుర్తించారు. కాగా దేవ్‌రంజన్ దాస్ ఇప్పటికే "ఎమోషనల్ డిజార్డర్ సిండ్రోమ్" కోసం చికిత్స పొందుతున్నాడని అతని మామ పోలీసులకు తెలిపారు. ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో నిరాశతో దేవ్‌రంజన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. "మేము ఈ మరణాన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేశాం. శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నాము" అని ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి ఆఫీసర్ ఇంద్రమణి జువాంగా తెలిపారు. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసందే. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ చేజారింది.

Updated Date - 2023-11-21T11:54:43+05:30 IST