Home » Odisha train accident
ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి మృతదేహాలను తాత్కాలికంగా ఉంచిన ఒక ప్రభుత్వ పాఠశాలను శుక్రవారంనాడు కూల్చివేశారు. ఈనెల 2న మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, పలు మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా గతవారం బాలాసోర్‌లోని బహనాగ హైస్కూలులో తాత్కాలికంగా ఉంచారు.
డబ్బులకోసం బతికున్న భర్త చనిపోయాడని అబద్ధం చెప్పింది ఓ మహిళ. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తన భర్త చనిపోయాడని.. మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులు కోరింది. ఇందుకు ‘‘నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా’’ అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఖంగుతున్న ఆమె అడ్డంగా దొరికిపోయింది.
ఒడిశా రైలు ప్రమాదం ఎంత విషాదం మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి అంగవైకల్యం, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రాణాలతో బయటపడిన ప్యాసింజర్లకు ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఓ పీడకలగా ఇంకా వారి కళ్లముందే కదలాడుతూనే ఉంది. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు అనుకోని సంఘటనతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని విషాదగాథ ఏంటో తెలుసుకుందాం..
ఒడిశా రైలు దుర్ఘటన ఇప్పట్లో మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే చరిత్రలోని అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు కోల్పోయిన వారి సంఖ్య వందల్లో ఉంది.
అక్రమార్కులకు అన్నిటిలోనూ అవకాశాలు కనిపిస్తాయి. దురాశపరులు శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. వీరిలో కనీసం 40 మంది విద్యుతాఘాతం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, రక్తస్రావం ఆనవాళ్లు కానీ కనిపించలేదన్నారు.
ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌తో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ విభేదించారు. ఇలాంటి సమయంలో విపక్షాల డిమాండ్ తెలివైన పని కాదని అన్నారు.
మూడు దశాబ్దాల్లో అతి పెద్ద రైలు ప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మంది క్షతగాత్రులయ్యారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదం ఎందరికో కన్నీళ్లు మిగిల్చింది. మరికొందరి జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఇలా ఎవర్నీ కదిలించినా అంతులేని