Home » Odisha train accident
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. సీబీఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించ లేవని అన్నారు.
తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఒడిశా పోలీసులు స్పందించారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా విధంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్దరించి పట్టాలపై తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు.
ఒడిశా రైలు ప్రమాదంలో(Odisha Train Accident) 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ (Odisha CS Pradeep) అధికారికంగా ప్రకటించారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాందలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ జి మొహంతి భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. అసిస్టెంట్ లోకోపైలట్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడం సంచలనంగా మారింది.
ఒడిశా (Odisha)లోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్ (Kharagpur)లోని సౌత్ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.