Home » Officers and Businessman
కాకినాడ సిటీ, అక్టోబరు 4: కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి గా శ్రీపాద మల్లిబాబు శుక్రవారం ఆయన చాంబర్‌లో బాధ్యతలు స్వీక రించారు. రాష్ట్ర ఎన్నికల అధికార కా ర్యాల యం డిప్యూటీ సీఈవోగా పని చేస్తూ సాధారణ బదిలీల్లో భా గంగా కాకినాడ ఆర్డీవోగా నియమితులయ్యా రు. తొలుత జిల్లా కలెక్టర్, జాయిం
జిల్లాలో ఖతర్నాక్ వీఆర్‌ఓల అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో వీరు అక్రమార్కులకు కొమ్ముకాశారు. అందినకాడికి దోచుకొని వెనకేసుకున్నారు.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు తమ పని పెండింగ్‌లో ఉంద ని అడిగే వారే లేడు. దీనికి మామూళ్లే ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ పనిని బట్టి మామూళ్ల వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పుట్లూరు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎక్కడినుంచో అధికారులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం అధికారులను తమతమ స్థానాలకు ...
ఓ ఇద్దరు అధికారులు వైసీపీ పాలనలో చెలరేగిపోయారు. ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారు. ఐదేళ్లలో అడిగేవారు లేకపోవడంతో అధికార దుర్వినియోగం, రూ.కోట్లలో నిధుల స్వాహా పర్వం సాగింది. వైసీపీ నేతల అండదండలు, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారుల కంటే వైసీపీ కార్యకర్తల్లా పని చేశారనే ఆరోపణులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల సిఫారసులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అవినీతి, అక్రమాల సొమ్ముల్లోనూ వారికి వాటాలు ...
వైసీపీతో అంటకాగిన పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు కొత్త ప్రభుత్వం గుబులు పట్టుకుంది. అడ్డగోలు పనులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. పంచాయతీల పరిధిలోని విలువైన స్థలాలను వైసీపీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో అధికారులను సైతం బురిడీ కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయని ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. ...
హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో ...
రెవెన్యూ అధికారులు మండల ప్రజలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. అడ్మిషన్ల సమయం కావడంతో విద్యార్థులు, పంట రుణాల రెన్యువల్ సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల విధులు, సమావేశాల పేరిట విడపనకల్లు తహసీల్దారు కార్యాలయానికి అధికారులు రావడమే మానేశారు. వనబీ అడంగల్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. పది రోజుల క్రితం ఆందోళన చేశారు. దీంతో మరుసటి రోజు అధికారులు అందుబాటులోకి వచ్చారు. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది...
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ)లు..
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీరింగ్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
రుద్రంపేట సర్కిల్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకూ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన నాటిన చెట్లు ఇవి. మండే ఎండలకు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చనిపోయాయి. మొక్కలు నాటించడంతో తమ పని అయిపోయినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు భావించినట్లున్నారు. హైవే నిర్మాణ క్రమంలో కొన్ని వందల వేప చెట్లను నిలువునా నరికేశారు. వాటి స్థానంలో ..