Home » olympics
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.
పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్ సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో రాణించిన ఆక్సెల్సెన్ ఫైనల్స్‌లో థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్‌సర్న్‌పై 21-11, 21-11 తేడాతో వరుస రెండు సెట్లలో విజయం సాధించి బంగారు పతకం సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ షూటౌట్‌కు దారి తీయగా 4-2తో హర్మన్‌ప్రీత్ సేన...
ఒలింపిక్స్ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే.
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.