Central Government Reaction: వినేష్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. లక్షల్లో ఖర్చు.. వెల్లడించిన కేంద్రమంత్రి.. విపక్షాల వాకౌట్..
ABN , Publish Date - Aug 07 , 2024 | 04:52 PM
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో స్పందించారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రెండుసార్లు బరువు కొలిచినప్పుడు ఆమె 50.100 కిలోలుగా తేలిందని క్రీడా మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వినేష్ ఫోగట్ అంశానికి సంబంధించి భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పిటి ఉషతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. వినేష్ ఫోగట్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించామని ఒలింపిక్ సంఘం తెలిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఆమె కోసం 70.45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో క్యూబా క్రీడాకారిణి ఓడించి ఫైనల్స్‌కు చేరింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించి చరిత్ర సృష్టించింది. ఫైనల్స్‌కు కొన్ని గంటల ముందు ఓ చేదు వార్త బయటకురావడంతో భారతీయులంతా నిరాశ చెందారు. వినేష్ ఫోగట్ బరువు ఎక్కువుగా ఉన్నారని తేలడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో విశ్వ క్రీడల నుంచి ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది.
Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్
రెండు సార్లు పరీక్షలు..
రెజ్లింగ్‌లో తలపడే క్రీడాకారులకు ప్రతి రోజు ఉదయం బరువును పరిక్షీస్తారని.. ఆ పరీక్షల్లో బరువు అధికంగా ఉన్నట్లు తేలడంతో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి తెలిపారు. 50 కిలోల విభాగంలో ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు చెప్పారు. ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారన్నారు. తన బరువును నిరూపించుకోవడంలో విఫలమైనా, బరువు పరీక్షకు ఆటగాడు హాజరుకాకపోయినా అతడిపై అనర్హత వేటు వేయడంతో పాటు.. ర్యాంకుల జాబితాలో దిగువకు చేరుస్తారని ఒలింపిక్ నిబంధనలు పేర్కొంటున్నాయని.. దీని ప్రకారం వినేష్ ఫోగట్ పైనల్స్ ఆడలేకపోతున్నట్లు తెలిపారు. వినేష్ ఫోగట్‌క ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు. తనకు క్రీడా సౌకర్యాలు కల్పించడంతో పాటు, అవసరమైన శిక్షణ ఇప్పించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ కోసం రూ.70,45,775 ఖర్చు చేసినట్లు తెలిపారు.
నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం
విపక్షాల ఆగ్రహం..
కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆమెపై అనర్హత వేటు పడిందని, తక్షణమే దీనిపై విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రమంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News