Home » Pallavi Prashanth
నగరంలోని చంచల్ గూడా జైలు ( Chanchal Guda Jail ) నుంచి బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashant ) విడుదలయ్యాడు. చంచల్ గూడా జైలు నుంచి తన నివాసానికి పల్లవి ప్రశాంత్ బయలుదేరి వెళ్లాడు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవలో... మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లని అరెస్టు చేశారు.
Telangana: అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Telangana: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. తీర్పును కోర్టు రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరుపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ కోర్టును కోరారు.
హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.