Share News

Pallavai Prashanth: పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 21 , 2023 | 04:17 PM

Telangana: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. తీర్పును కోర్టు రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరుపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ కోర్టును కోరారు.

Pallavai Prashanth: పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (BigBoss Winner Pallavi Prashanth) బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. తీర్పును కోర్టు రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరుపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ కోర్టును కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడం వలనే ఇలాంటి పరిణామాలు జరిగాయని లాయర్ తెలిపారు. బిగ్ బాస్ గెలిచిన ప్రశాంత్‌కు బెయిల్ ఇవ్వాలని, తనకు బయట జరిగిన ఉదంతం తెలియదని కోర్టుకు న్యాయవాది వేణుగోపాల్ తెలిపారు. అక్కడ జరిగిన గొడవకు పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న మధ్యాహ్నం 2 నుంచి అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారని.. పల్లవి ప్రశాంత్ బయటికి ఒచ్చింది రాత్రి 10:30 గంటల తరువాతే అని చెప్పారు. మధ్యాహ్నం నుండి పోలీసులు అక్కడే ఉండి మాబ్‌ను కంట్రోల్ చేయలేకపోయారని తెలిపారు. సంబంధం లేకున్నా పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరపు న్యాయవాది వేణుగోపాల్ కోరారు.

పీపీ వాదనలు ఇవే.. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాకే వారి అనుచరులు గొడవ చేశారని అన్నారు. డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చి బతిమలాడినా మాబ్ వినలేదన్నారు. అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని... పోలీస్ వాహనాలపై దాడి చేశారన్నారు. పోలీసులపై రాళ్ళు రువ్వారన్నారు. ప్రస్తుతం ఏ 3 ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు. ఇరువురి వాదనలు పూర్తి అవడంతో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2023 | 04:21 PM