Bigg Boss: బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవలో... మరో 16 మంది అరెస్టు
ABN , Publish Date - Dec 21 , 2023 | 08:05 PM
బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవలో... మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లని అరెస్టు చేశారు.
హైదరాబాద్: బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవలో... మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు గొడవకు కారణమైన 16 మందిని హాజరు పరిచారు. 16 మందికి 14 రోజుల జ్యూడిషియల్ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు మైనర్లను జూవైనల్ హోంంకు తరలించారు. మిగిలిన వారిని చంచల్ గూడా జైలుకు పోలీసులు తరలించారు.
కాగా.. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
అయితే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను (Bigg Boss Winner Pallavi Prashant) జూబ్లీహిల్స్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంతి రిమాండ్ రిపోర్టు ఏబీఎన్ (ABN-Andhrajyothy) చేతికి చిక్కింది. విధుల్లో ఉన్న పోలీసులకు పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో ఉంది.