Pallavi Prashant: చంచల్‌గూడా జైలు నుంచి పల్లవి ప్రశాంత్ విడుదల
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:04 PM
నగరంలోని చంచల్ గూడా జైలు ( Chanchal Guda Jail ) నుంచి బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashant ) విడుదలయ్యాడు. చంచల్ గూడా జైలు నుంచి తన నివాసానికి పల్లవి ప్రశాంత్ బయలుదేరి వెళ్లాడు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: నగరంలోని చంచల్ గూడా జైలు ( Chanchal Guda Jail ) నుంచి బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashant ) విడుదలయ్యాడు. చంచల్ గూడా జైలు నుంచి తన నివాసానికి పల్లవి ప్రశాంత్ బయలుదేరి వెళ్లాడు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి 1వ తేదీ 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాలుగు రోజుల పాటు పల్లవి ప్రశాంత్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌ను చూసేందుకు చంచల్ గూడా జైలుకు అభిమానులు భారీగా చేరుకున్నారు.
కాగా.. బిగ్ బాస్ టైటిల్-7 గెలుపొందిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న సమయంలో తన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. పోలీస్ శాఖ సూచనలు, సలహాలు పాటించకుండా తన అభిమానులను రెచ్చగొట్టడం ద్వారా అర్థరాత్రి పెద్ద ఘర్షణ చెలరేగింది. ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ పాటు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పాటబిడ్డ బోలే హర్షం
అయితే.. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలవడంపై పాటబిడ్డ బోలే సంతోషం వ్యక్తం చేశాడు. బెయిల్ రావడానికి సాయం చేసిన లాయర్లకు ఆయన థ్యాంక్స్ తెలిపాడు. నిజానికి ప్రశాంత్ ఫ్యాన్స్, కొంతమంది అల్లరి మూకలు చేసిన దాడిలో భోలే కూడా బాధితుడే. అతని కారుని కూడా ధ్వంసం చేశారు. అయితే ప్రశాంత్‌కు ఆది నుంచి భోలే అండగా నిలబడిన విషయం తెలసిందే. లాయర్లను కలిసి పల్లవి ప్రశాంత్‌ని బెయిల్‌పై తీసుకుని రావడానికి అతను ఎంతగానో కృషి చేశాడు. చివరికి . పల్లవి ప్రశాంత్‌కి బెయిల్ రావడంతో బోలే హర్షం వ్యక్తం చేశాడు.