Home » Parliament
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) దృష్టి సారించారు. కాసేపటి క్రితమే పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRDలో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.
Telangana Parliament Elections తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS) పార్టీ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని ‘కారు’కు పూర్తిగా పంక్చర్ కాలేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది..
నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మీద కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడిప్పుడే సౌండ్ పెంచుతున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఎంపీ సీట్ల కేటాయింపు అంశంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాల నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30వ తేదీలలో చలో ఢిల్లీ , పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
బీఆర్ఎస్ ( BRS ) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) , మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్‌సభ ( Chevella Lok Sabha ) కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు.
'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'.. అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేసింది హైలెవల్ కమిటీ. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంలో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాలు, సూచనలు చేయాలని కోరింది ఈ కమిటీ.
బీజేపీ ( BJP ) ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో కష్టపడ్డ వారికే ‘స్థానిక’ టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ కోరారు.