Home » Patancheru
హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మన్ అనే యువకుడిని అరెస్టు చేశారు.
సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’’ అంటూ మోదీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.
సంగారెడ్డి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Telangana: దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.
#RIPLasya Nanditha: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు...
Telangana: జిల్లాలోని పటాన్చెరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.