Sreeleela: రామచంద్రాపురంలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:32 AM
రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్ సాయినగర్ కాలనీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 37వ షోరూమ్‌ను నటి శ్రీలీల ప్రారంభించారు.
ప్రారంభించిన నటి శ్రీలీల
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్ సాయినగర్ కాలనీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 37వ షోరూమ్‌ను నటి శ్రీలీల ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేష్ శీర్ణ మాట్లాడుతూ రామచంద్రాపురం వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. సంస్థ డైరెక్టర్ అభిమాన్యు మాట్లాడుతూ పండుగలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు రాకేశ్, కేశవ్ కూడా మాట్లాడారు.