Share News

MLA Nallari: విద్యార్థి దశ నుంచే మొక్కల సంరక్షణ అలవాటు కావాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:43 PM

విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.

MLA Nallari: విద్యార్థి దశ నుంచే మొక్కల సంరక్షణ అలవాటు కావాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, సెప్టెంబర్టు 5: విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. స్థానిక నల్లారి అమరనాథ రెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ కళా శాల, బాలుర ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన వనమహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైస్కూల్‌లో ఓపెన ఆడిటోరియం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి ఆయన సాను కూలంగా స్పందించారు. సోమల మార్గంలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించేం దుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం రెండు విద్యా సంస్థల ఆవరణల్లో ఆ యన మొక్కలు నాటారు. కలికిరి సర్పంచ యల్లయ్య, జనసేన ఇనచార్జిలు దినేష్‌, అస్లాం, నాయకులు నిజాముద్దీన, రెడ్డివారి యోగేష్‌ రెడ్డి, రమేష్‌ చెట్టి, రెడ్డెప్ప రెడ్డి, సతీష్‌కుమార్‌ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, వైజాగ్‌ బాషా, మధు, రాజేష్‌, గోపి పాల్గొన్నారు.

ఆలయాల భూములను పరిరక్షించాలి

ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం తనను కలుసుకున్న దేవాదాయ శాఖ జిలా అధికారి విశ్వనాథ్‌, ఎండోమెంట్‌ అధికారి మంజుల, ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. ఆలయ భూములతోపాటు శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు మం జూరయిన ఆలయాల జాబితాను సమీక్షించారు. నియోజకవర్గంలో ధూప, దీప నైవేద్యం పథకం అమలవుతున్న ఆలయాల వివరాలను పరిశీలిం చారు. ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామ కాలపై అధికారులకు సూచనలిచ్చారు. రెడ్డెమ్మ ఆలయ ఈవో మంజుల, అధికారు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 11:43 PM