Home » Police Constable
‘ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవారే పోలీస్’ అంటూ.. శిక్షణా సమయంలో ఉన్నతాధికారులు చెబుతుంటారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన 1,037 మంది పోలీసు సిబ్బందికి పతకాలను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత..
దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది హోంగార్డుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఏపీకి చెందిన పలు జిల్లాల నుంచి హోంగార్డులు విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 2 వేల మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలోనే ఉండిపోయారు.
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
Telangana: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
హైదరాబాద్: నగరంలో కానిస్టుబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద టీఎస్ఎస్పీ (TSSP) కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.10వ బెటాలియన్‌లో పనిచేసే పాలేశ్వర్ సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా హిదూర్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు వీరమరణం పొందగా, ఒక మావోయిస్టు మృత్యువాత చెందాడు.