Share News

Viral Video: ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..

ABN , Publish Date - Dec 15 , 2024 | 01:19 PM

విధుల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నేరస్థులకు భయం పుట్టించే పోలీసులు కొందరైతే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నేరస్థులకు సహకరిస్తూ మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా.. చలికి తట్టుకోలేక ఖైదీతో..

విధుల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నేరస్థులకు భయం పుట్టించే పోలీసులు కొందరైతే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నేరస్థులకు సహకరిస్తూ మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పోలీసు చేసిన విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై వెళ్తున్న సమయంలో చలికి తట్టుకోలేక ఓ పోలీసు చేసిన నిర్వాకం.. అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పోలీసు అతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) మెయిన్‌నపురిలోని భోగవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కారులో వెళ్తు్న్న కొందరు.. ఎదురుగా ఓ బైకుపై వెళ్తున్న పోలీసును చూసి షాక్ అయ్యారు. యూనిఫామ్ ధరించిన ఓ కానిస్టేబుల్ (Police Constable) బైకు వెనుక కూర్చుని ఉండగా.. ముందు వైపు ఖైదీ కూర్చుని బండి డ్రైవ్ చేస్తున్నాడు. అతడి చేతికి సంకెళ్లు కూడా ఉన్నాయి.

Viral Video: సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..


చలికి తట్టుకోలేని పోలీసు.. ఇలా అతి తెలివిగా ఆలోచించి, నేరస్థుడితో (prisoner driving a bike) బైక్ డ్రైవ్ చేయించినట్లు తెలిసింది. ఈ ఘటన చూసి రోడ్డుపై వెళ్తు్న్న వారందరూ షాక్ అయ్యారు. కారులోని వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: వామ్మో.. ఇదేంటీ.. చలి నుంచి తప్పించుకోవాలని మంటపై పడుకున్న వ్యక్తి.. చివరికి జరిగింది చూస్తే..


ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. ఈ ఘటనపై విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ పోలీసు తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వధువుకు స్వీట్ తినిపించాలని చూసిన వరుడు.. చివరకు ఆమె రియాక్షన్ చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 15 , 2024 | 01:19 PM