Home » Ponnam Prabhakar
రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శలు చేశారు. రుణమాఫీపై రైతులు కంగారు పడొద్దని.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు రూ.2 లక్షలు రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.
కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
వినాయక చవితి ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. వినాయక చవితి, వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధినేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల గురించి ఈ రోజు చర్చించామని మీడియాకు వివరించారు. వినాయక చవితి సందర్భంగా గతంలో లోపాలు జరిగాయని, ఆ లోటుపాట్లు లేకుండా ఈ సారి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రు లు సీతక్క, పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Telangana: రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
రవాణాశాఖలో సీఎం పీఏ దందాలు చేస్తున్నారని, అందులో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఫిర్యాదులు వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు సుదర్శన్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కరప్షన్, కలెక్షన్ కాంగ్రెస్ విధానమని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. హరీష్రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్కు లేదని మండిపడ్డారు.