Share News

Konda Surekha: బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:11 PM

బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు..

Konda Surekha: బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..
Ministers Konda Surekha

మెదక్, అక్టోబర్ 03: బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి కొండా సురేఖ.. బీఆర్ఎస్, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.


కొండా సురేఖ కామెంట్స్..

‘గజ్వేల్ ప్రజలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని నమ్మకం ఉంది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్.. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుంది. ఎంపీలుగా బీజేపీని గెలిపిస్తామని, కవితని వదిలిపెట్టాలని ముందే అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా అని మేము చూస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలను తప్పు దారి పట్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, రాతలు రాపిస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం ఇంతవరకు నియోజకవర్గంలో కానీ, అసెంబ్లీలో కానీ అడుగుపెట్టలేదు. గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది ప్రశ్నగా ఉంది. కేసీఆర్ కనపడట్లేదు అని పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వాలి. కేసీఆర్‌ను పక్కన పెట్టి.. ప్రజా సొమ్మును దోచుకొని.. ప్రజలలో బీఆర్ఎస్‌పై నమ్మకం పోయేలా చేసింది కేటీఆర్. మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కేటీఆర్. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి కానీ అడ్డుపడితే ఊరుకునేది లేదు.’ అని అంటూ విపక్షాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి.


హామీలన్నీ అమలు చేస్తాం..: తుమ్మల

తల తాకట్టు పెట్టి అయినా రైతాంగానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే రూ. 2 లక్షల రుణ మాఫీనీ పూర్తిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు రైతు రుణమాఫీపై మాట కూడా మాట్లాడలేదు. దేశంలో ఏ రైతు పండించని పంటలు మన రైతులు పండిస్తున్నారు. ప్రతి గింజను మార్కెట్ ధర కంటే ఎక్కువకు ప్రభుత్వమే కొని రైతులను ఆదుకుంటాం. రైతును దగా చేసిన వాళ్ల మాటలు నమ్మవద్దు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తాం. సంవత్సరం లోపు రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం. పామ్ ఆయిలో రాష్ట్రంలో, దేశంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో ఉండాలి. ఇతర దేశాల నుండి లక్ష కోట్లు పెట్టు ఆయిల్ కొంటున్నాము. ఇప్పటికే 11 వేల ఎకరాలు సాగు అవుతుంది. ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి కావలసిన ఆయిల్ మొత్తం తెలంగాణ ఇస్తుందని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు.’ అని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.


రైతాంగానికి అండగా కాంగ్రెస్ సర్కార్: పొన్నం ప్రభాకర్

‘రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు 1వ తేది నుండి అందుబాటులోకి వస్తాయి. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. నాటి ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా రాచరికపు నిర్ణయాలు తీసుకున్నారు. శాసన సభ్యునీ హోదాలో ఇంత వరకు నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. బీజేపీ, బీఆర్ఎస్ రైతు వ్యతిరేఖ చట్టాలు తీసుకువచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతాంగం అండగా ఉంది. గత ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వవలసిన పనిముట్లను వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ విధంగా కాకుండా చిన్న, సన్నకారు రైతులకే వ్యవసాయ పనిముట్లు అందజేస్తాం.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు భరోసా ఇచ్చారు.


Also Read:

నవగ్రహాలు దాటించి మరీ తరిమికొట్టారుగా...

గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్...

జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీవ్ర నష్టం

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 03 , 2024 | 05:11 PM