Home » Pressmeet
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.
విజయవాడ: మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ మోసం చేసిందని నిరుద్యోగ యువత ఆందోళన చేస్తోందని, యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
విశాఖ: ఋషికొండపై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ సొంత భవనాల్లా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.
అమరావతి: అన్నా క్యాంటీన్లపై అధికారులతో ఆదివారం రివ్యూ చేశామని, గతంలో 203 అన్నకాంటీన్లకు అనుమతి ఇచ్చామని, 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు.
అమరావతి: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో జగన్ తన సొంత ఇంటి కోసం.. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని, దీని కోసం సుమారు రూ. కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని..
కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకే ప్రజల మధ్యకు వచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.