Home » Pressmeet
కడప: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని...
చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని మట్టి, ఇసుక, భూ కబ్జాలతో పేట్రేగిపోతున్నారని విమర్శించారు.
మహబూబ్‌నగర్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది.
అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మే 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తానని.. నిజం గెలవాలి కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని నారా భువనేశ్వరి వెల్లడించారు.
కరీంనగర్: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రబాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
అమరావతి: రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ...
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి జరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారని.. సీఎంకు కనీసం భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి అసమర్థత బట్టబయలు అయ్యిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అంకా దినకర్ అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.