Share News

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

ABN , Publish Date - Oct 13 , 2024 | 01:55 PM

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోనూ వాల్మీకి జయంతి అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా మంత్రి సవిత పాల్గొంటారు.

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

అమరావతి: యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో తాను ఇచ్చిన మరో హామీ (Promise)ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. వాల్మీకి జయంతిని (Valmiki Jayanti) రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు యువగళం పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అదే రోజు అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల పుట్టినిల్లని.. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని నారా లోకేస్ పేర్కొన్నారు.


రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి..

కాగా రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోనూ వాల్మీకి జయంతి అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా మంత్రి సవిత పాల్గొంటారు.

కాగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీల్లో మొదటి హామీ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో (సెప్టెంబర్ 20న) కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌‌ను (Dialysis Center)‌ ప్రారంభించారు. సెంటర్‌ను పరిశీలించిన లోకేష్.. రోగులతో మాట్లాడారు. అలాగే 30 పడకల ఆస్పత్రిని, ఆవరణలో రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. యువగళాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం యత్నించిందని, కుట్రను ఛేదించుకుంటూ యువగళం యాత్ర సాగిందని లోకేశ్ వ్యాఖ్యానించారు.


సామాజిక పెన్షన్లను ఒకేసారి రూ.4 వేలకు పెంచామని, రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సెంటర్లను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నామన్నారు. దీంతో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా.. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని, ఫేక్‌ జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేశారని, అడుగడుగునా జగన్‌ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తిరుమల లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారని లోకేష్‌ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

హైదరాబాద్: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్

విదేశీ మద్యం ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 01:55 PM