Home » Pressmeet
తిరుపతి: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, ఆయన ద్వారా భూమి కోల్పోయిన బాధితులందరూ బయటకు వచ్చి.. పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయాలని పిలుపిచ్చారు.
న్యూఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పత్రికా ప్రకటనలో పేర్కొ్న్నారు. రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయింది.
ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు.
విశాఖ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు.
విశాఖ: మార్చి 22 న విశాఖ పోర్టుకు దిగుమతైన రూ. 25 వేల కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని.. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్ధ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని.. ఆ సంస్ధతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం విజయవాడకు బయలుదేరి వస్తారు. మధ్యాహ్నం 1-50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శనివారం బిజీ బిజీగా గడిపారు. నీతి అయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తిరుపతి: తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు.