Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:47 AM
హెచ్‌సీయూ భూముల మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి ఎవరని.. మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రబ్బర్ స్టాంప్‌లు అని, మంత్రి వర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశ భక్తి పార్టీ అని.. ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని ఆయన అభవర్ణించారు.

కరీంనగర్: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల (HCU Lands)మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి (Natarajan Meenakshi) ఎవరని.. మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు రబ్బర్ స్టాంప్‌లు అని, మంత్రి వర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశ భక్తి పార్టీ అని.. ఎంఐఎం (MIM) దేశ ద్రోహ పార్టీ అని ఆయన అభవర్ణించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంటుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..: శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..
కాగా భూముల అమ్మకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్‌ను మించిపోతోందని బండి సంజయ్ ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ రూ.20 వేల కోట్ల విలువైన భూములను విక్రయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.50 వేల కోట్ల విలువైన భూములు విక్రయించి, పెద్దమొత్తంలో దండుకునేందుకు సిద్ధమైందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు భావితరాలకు గజం జాగా కూడా లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ప్రభుత్వ వైఖరిని విమర్శించిన స్కాలర్ రోహిత్‌పై దాడి చేయడమే కాకుండా ఆయన్ను జైలుకు పంపించారని, రోహిత్ మీద అక్రమ ఆయుధాల కేసు పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేస్తారా అని బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్టడుగువర్గాల ఆణిముత్యం జగ్జీవన్‌రాం అని సంజయ్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, అంబేద్కర్‌ను పార్లమెంటులో అవమానించి మంత్రి పదవికి రాజీనామా చేయించిందని, డుప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అంబేద్కర్‌ను మాత్రం విస్మరించారని మండిపడ్డారు. ప్రధాని అయ్యే అర్హత ఉన్న నేత జగ్జీవన్‌రాం అని.. కానీ, దళితుడికి అవకాశం ఇవ్వవద్దన్న కుట్రతో నాడు ఇందిర గాంధీ ఎమర్జెన్సీ విధించారని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు
పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి..
20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..
For More AP News and Telugu News