Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:49 AM
వైఎస్ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఏలూరు: తెలుగుదేశం పార్టీ నాయకులపై (TDP leaders) వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు (controversial). ‘మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం’ అంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక గుంటూరుకు ఇటువైపువాళ్లను లాక్కొచ్చి కొడతామని.. అటువైపువాళ్లను నరికి పారేస్తాంటూ కారుమూరి పరుస పదజాలంతో మాట్లాడారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన ప్రభుత్వమే వస్తుంది’ అని.. ‘గుంటూరు అవతలవారిని నరికేస్తాం... ఇవతలవారిని ఇంటి నుంచి లాక్కొచ్చి కొడతాం’ అని వ్యాఖ్యలు చేశారు.
‘నేను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని దాటి ప్రజలు మనకు ఓటేస్తారని చెప్పాను. తెలుగుదేశం నాయకులు సైతం మాపై కక్ష పెట్టుకోవద్దు అని అంటున్నారు. అది మాత్రం జరగదు. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి నుంచి నరికిపారేస్తారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరం’ అంటూ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Also Read..: చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ..
కారుమూరి చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జగన్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా, వైసీపీ నేతల్లో అధికార మదం ఇంకా దిగలేదని.. వారి నేర ప్రవృతికి ఇదే నిదర్శనమని అన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రైతుల్ని ఎర్రిపప్పలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన కారుమూరి ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థంగా చెప్పారు. దాంతో అందరూ ఆయనను ఎర్రిపప్పా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
కాగా కారుమూరి నాగేశ్వరరావు చేసిన హెచ్చరికలపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. బహిరంగంగా చంపుతామని హెచ్చరిస్తున్న ఆయనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టి.. హింస జరిగేలా చేసి..రాష్ట్రంలో పరిస్థితులు దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని.. పెట్టుబడులు వస్తున్నాయని ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల్ని ఇలా హెచ్చరించడం ద్వారా వారిలో ఎవరైనా ఆవేశంగా ఏదైనా చేస్తే.. వెంటనే దాన్ని జాతీయ స్తాయి ఇష్యూగా చేసి.. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని ప్రచారం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
సింగపూర్ బయల్దేరిన చిరంజీవి దంపతులు ..
For More AP News and Telugu News