Home » Protest
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది.
మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.
పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పొరుగునున్న బంగ్లాదేశ్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను భారత్ నిశీతంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసపై భారత్ తనదైనశైలిలో స్పందించింది. అందులోభాగంగా ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కీలక సూచనలు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46రద్దు చేయాలంటూ బేగంపేట్‌లోని ప్రజాభవన్ ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 200మంది అభ్యర్థులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ ముందుగా ప్రజాభవన్‌లో మెమొరాండం అందించారు. అనంతరం ఎన్నికల హామీ మేరకు జీవో 46రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి(MP Ayodhya Rami Reddy) అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ని కత్తితో చేతులు నరికి, తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణం అని ఎంపీ అన్నారు.