Share News

Waqf Protest: వక్ఫ్ నిరసన ప్రదర్శనలో హింసాకాండ.. పోలీసు వాహనాలకు నిప్పు

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:47 PM

వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్‌పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Waqf Protest: వక్ఫ్ నిరసన ప్రదర్శనలో హింసాకాండ.. పోలీసు వాహనాలకు నిప్పు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) లోని ముర్షీదాబాద్‌ (Murshidabad) లో హింసాకాండ (Violence) చెలరేగింది. వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్‌పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ చేటుచేసుకుంది. ఆందోళనకారులు రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నాయి.


మమత రెచ్చగొట్టే ప్రసంగాలతోనే హింస: అమిత్ మాలవీయ

కాగా, ముర్షీదాబాద్‌లో హింసాత్మక ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆందోళన వ్యక్తం చేశారు. హోం మంత్రిగా కూడా ఉన్న మమతా బెనర్జీ ఆదేశాల మేరకే ఇస్లామిక్ అల్లరిమూక వీధుల్లో రెచ్చిపోయారని అన్నారు. ''ప్రస్తుతం నెలకొన్న అశాంతికి ఆమె (మమత) రెచ్చగొట్టే ప్రసంగాలే కారణం. ఇదే ప్రాంతంలో గతంలో హిందువుల కార్తీక పూజోత్సవాలపై కూడా దాడులు జరిగాయి. మమతా బెనర్జీ పదేపదే ముస్లింలను బుజ్జగించే చర్యల వల్లే బెగాల్ బంగ్లాదేశ్ తరహాలో పశ్చిమబెంగాల్ కూడా ప్రమాదం అంచులకు చేరుతోంది" అని అమిత్ మాలవీయ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 09:08 PM