Anti-Waqf Act protests: సిల్చర్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం.. పోలీసులపై రాళ్లు
ABN , Publish Date - Apr 13 , 2025 | 07:02 PM
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిల్చర్: వక్ఫ్ వ్యతరేక నిరసనలు (Anti Waqf protests) హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా అసోం (Assam)లోని సిల్చర్ (Silchar)లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. వ్యక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారంనాడు సుమారు 400 మంది నిరసనకు దిగారు. పోలీసులతో ఘర్ణణలకు దిగిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు.
Suvendu Adhikari: ప్రాణభయంతో ఇళ్లు వీడిపోయిన 400 మందికి పైగా హిందువులు
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెచ్చిపోయిన కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో, పోలీసులు లాఠీలు ఝలిపించారు.
సీఎం అభినందించిన కొద్ది గంటల్లోనే..
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారంనాడు మీడియా సమావేశంలో పోలీసులు, మైనారిటీ నేతలపై ప్రశంసలు కురిపించారు. వక్ఫ్ బిల్లుపై రాష్ట్రంలో అశాంతి నెలకొనే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర పోలీసులు, మైనారిటీ లీడర్లు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు మైనారిటీ కమ్యూనిటీ నేతలు, మసీదు కమిటీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. మూడు చోట్ల నిరసనలు జరిగినప్పటికీ ఒక్కో ర్యాలీలోనూ 150 మందికి మించి లేరని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి