HCU Land Issue: హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:48 AM
బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

హైదరాబాద్: హెచ్సీయూ భూముల వ్యవహారంపై (HCU land issue) రాజకీయ రగడ (Political turmoil) కొనసాగుతోంది. మంగళవారం హెచ్సీయూకు వెళతామని బీజేపీ ప్రజాప్రతినిధుల (Political turmoil) బృందం తెలిపింది. దీంతో హైదర్‌గూడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Hyderguda MLA Quarters) దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత (Tension) ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెర లేపిందంటూ బీజేపీ ఆందోళనకు పిలుపిచ్చింది. గత రెండు రోజులుగా వరుసగా బీజేపీతోపాటు బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఆందోళనకు పిలుపిచ్చాయి.
Also Read..: KTR: హెచ్‌సియూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏమిటి..
హైదర్‌గూడ వద్ద ఉద్రిక్తత..
మంగళవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా హెచ్సీయూ భూములు అమ్మే విషయంలో వెనక్కి తగ్గేదేలేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థి సంఘాలు తరగతుల బహిష్కరణ..
ఆ నిధులను సంక్షేమ పథకాలకు వినియోగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇదే తరహా అంశానికి తెరలేపింది. అప్పట్లో టీపీసీపీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మే కార్యక్రమానికి తెరలేపిందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి భూముల అమ్మకానికి తెరలేపారంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపిచ్చింది. మరోవైపు హెచ్సీయూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు ఇవాళ తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది.
యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
మరోవైపు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములు వేలంపై ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఇంచు భూమి కూడా వదులుకోమంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..
ఢిల్లీ బాట పట్టిన అఖిలపక్షం నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
For More AP News and Telugu News