Home » Protest
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.
రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.
రేపు (ఫిబ్రవరి 16న) భారత్ బంద్ కొనసాగనుంది. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్‌లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా స్కూల్స్ బంద్ ఉంటాయా లేదా అనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.
పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో బయలుదేరిన రైతులు.. సుదీర్ఘ కాలం పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించుకొని.. అందుకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రిలను వెంట వేసుకొని వచ్చినట్టు తెలిసింది.
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు
తమ డిమాండ్లు నెరవేర్చాలని రైతులు కదం తొక్కారు. దేశ రాజధానిలో భారీ నిరసన చేపట్టేందుకు బయల్దేరారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద బారికేడ్ల ఏర్పాటు, అదనపు పోలీసు బలగాలను మొహరించారు.
హైదరాబాద్: శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ.. కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ..