Share News

Delhi Chalo: రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే

ABN , Publish Date - Feb 24 , 2024 | 07:38 AM

యునైటెడ్ కిసాన్ మోర్చా 'ఢిల్లీ చలో(Delhi Chalo)' మార్చ్‌ను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 29న ఉద్యమంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు సర్బన్ సింగ్ పంధేర్ తెలిపారు.

Delhi Chalo: రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ వాయిదా.. నెక్ట్స్ ఎప్పుడంటే

కనీస మద్దతు ధర (MSP) సహా పలు డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతుల 'ఢిల్లీ చలో(Delhi Chalo)' పాదయాత్రకు ప్రస్తుతానికి విరామం ప్రకటించారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా 'ఢిల్లీ చలో మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. దీంతో గత రెండు రోజులుగా రైతుల ఆందోళనకు బ్రేక్ పడింది. 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ఫిబ్రవరి 29వ తేదీకి వాయిదా వేసినట్లు ఖానౌరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తెలిపారు. తదుపరి వ్యూహంపై 29న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 24న ‘క్యాండిల్‌ మార్చ్‌’ చేపడతామని, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించారు.

యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీతో పాటు వివిధ డిమాండ్లపై రెండు సంస్థలు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. వీరి పిలుపు మేరకు హర్యానా(haryana), పంజాబ్(punjab) మధ్య శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో రైతులు విడిది చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?


ఖానౌరీలో జరిగిన ఘర్షణలో ఒక నిరసనకారుడు మరణించడం, సుమారు 12 మంది పోలీసులు గాయపడటంతో రైతు నాయకులు బుధవారం రెండు రోజుల పాటు 'ఢిల్లీ చలో' ఉద్యమాన్ని నిలిపివేశారు. రైతులు బారికేడ్‌ని బద్దలు కొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా వేలాది మంది రైతులు ఖానౌరీ, శంభు సరిహద్దుల వద్ద ట్రాక్టర్-ట్రాలీలతో నిలబడి పంటలకు MSP చట్టపరమైన హామీ, వ్యవసాయ రుణాల మాఫీతో సహా తమ వివిధ డిమాండ్ల(demands) కోసం ఒత్తిడి చేస్తున్నారు.

పంజాబ్‌, హర్యానా రైతులు(farmers) స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలని, కరెంటు రేట్లు పెంపుదల వద్దని కోరుతున్నారు. దీంతోపాటు నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని, భూసేకరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2024 | 07:38 AM